శ్రీవారి అన్నప్రసాదానికి అమెరికా భక్తులు ఫిదా

american-devotees-admiration-for-srivari-annaprasadam

తిరుమలలో టీటీడీ పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాన్ని స్వీకరించిన అమెరికన్‌ యాత్రికులు ఆహారం చాలా బాగుందన్నారు. గాడ్స్‌ పుడ్‌ ఈజ్‌ వెరీగుడ్‌ అంటూ ప్రశంసించారు. అమెరికాకు చెందిన 20 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారు ఆలయం వెలుపలకు వచ్చే సరికి భోజన సమయం కావడంతో టీటీడీ సిబ్బంది సూచనతో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనానికి చేరుకుని నాలుగో నంబరు హాలులో బఫే విధానంలో అన్న ప్రసాదం స్వీకరించారు. పదార్థాలన్నీ రుచిగా ఉన్నాయంటూ సంతోషం వ్యక్తం చేశారు.

Latest Updates