మసూద్ గ్లోబల్ టెర్రరిస్ట్: అమెరికా హర్షం

జైషే మహ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్ ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించడంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో హర్షం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా సహా అంతర్జాతీయ సమాజం చేసిన కృషి కారణంగానే ఈ ప్రకటన వచ్చిందని ట్వీట్ చేశారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ పరిణామం అమెరికా సహా ప్రపంచ దేశాల విజయంగా మైక్ పాంపియో చెప్పారు. దక్షిణాసియాలో శాంతి నెలకొనేందుకు ఇది ముఖ్యమైన పరిణామం అని చెప్పారు.

Latest Updates