యాక్సిడెంట్​ అయింది.. లేని ట్యాలెంట్​ పుట్టుకొచ్చింది

మామూలుగా అయితే ఎవరికైనా యాక్సిడెంట్​ జరిగితే కొన్ని సందర్భాల్లో గతాన్ని మరిచిపోతుంటారు. కానీ, ఓ కార్​ సేల్స్​మ్యాన్​కు మాత్రం తనలో అప్పటిదాకా లేని కొత్త ట్యాలెంట్​ పుట్టుకొచ్చింది. మంచి ‘పెయింటర్​’ను చేసింది. అవును, అమెరికాలోని నార్త్​కరోలినాకు చెందిన 42 ఏళ్ల స్కాట్​ మీలీ కథ ఇది. 2015లో ఓ ఇంటర్​సెక్షన్​ దగ్గర ఆపి ఉన్న తన కారును వేగంగా వస్తున్న ఇంకో కారు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో స్కాట్​ తలకు తీవ్రగాయాలయ్యాయి. దాని ప్రభావం మెదడుపై పడింది. ఆ ప్రమాదం నుంచి బయటపడినా డిప్రెషన్​, యాంగ్జైటీతో బాధపడ్డాడు. ఆ తర్వాత కొన్ని నెలలకు తన పిల్లలతో కలిసి షాపుకెళ్లిన స్కాట్​, పెయింటింగ్​ బ్రష్​, ఇతర వస్తువులను కొన్నాడు.

అప్పటిదాకా ఆ బ్రష్​ పట్టుకోవడం కూడా తెలియని అతడు, అద్భుతమైన బొమ్మలు గీశాడు. దీంతో తానేనా ఇంత మంచి పెయింటింగ్​ వేసింది అని అనుకున్నాడు. మళ్లీ ఇంకో పెయింటింగ్​ వేశాడు. అదీ సూపరే. అయితే, దానికీ కారణముందని చెబుతున్నారు డాక్టర్లు. పదిలక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని అంటున్నారు. దాన్నే ‘అక్వైర్డ్​ సావంత్​ సిండ్రోమ్​’ అని చెబుతున్నారు. అంటే ఏదైనా ప్రమాదం, లేదా ఆటిజంతో బాధపడుతున్న వాళ్లు రికవరీ అయ్యాక సడన్​గా ఇలాంటి లేని ట్యాలెంట్​లు పుట్టుకొస్తాయని చెబుతున్నారు. ఎందుకు అలా జరుగుతుందో చెప్పలేమంటున్న సైంటిస్టులు, బ్రెయిన్​లోని ఓ రీజియన్​ యాక్టివేట్​ అవ్వడం వల్ల ఇలాంటి ట్యాలెంట్​లు వస్తుండొచ్చని చెబుతున్నారు. అయితే, ఆడవాళ్లతో పోలిస్తే మగవాళ్లలోనే ఇలాంటి సడన్​ ట్యాలెంట్​లు వస్తుంటాయని అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో ఇలాంటి కేసులు 33 దాకా ఉండొచ్చని అంచనా.

Latest Updates