ప్రొఫెసర్ సర్వే: సెలబ్రిటీల వల్లే మోడీకి పేరు

ట్విట్టర్ లో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్నక్రేజే వేరు. దాదాపు 4.6 కోట్ల మంది ఆయన్ను ట్విట్టర్లో ఫాలో అవుతున్నారు. అయితే, ఆయనకు వచ్చిన ఆ చరిష్మా సొంతంగా రాలేదంటోంది అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ . 2014 ఎన్ని కలసమయంలో అమితాబ్ బచ్చన్ , సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులను వాడుకోవడం వల్ల ట్విట్టర్లో ఆయనకు ఫాలోయింగ్ పెరిగిందని, దాని వల్లే ఆయన రాజకీయ ప్రయోజనాలు పొందారని యూనివర్సిటీ అసోసియేట్​ ప్రొఫెసర్ జోయోజీత్ పాల్ చెప్పారు. 2009 ఫిబ్రవరి నుంచి 2015 అక్టోబర్ వరకు మోడీ పంపిన 9 వేల ట్వీట్లను ఆయన పరిశీలించారు. 2002 గుజరాత్ అల్లర్లను అన్ని ప్రధాన మీడియాలు ఎత్తి చూపించాయని, ఆ టైంలో మోడీ గ్రాఫ్ చాలా తక్కువగా ఉండేదని ఆ స్టడీలో వివరించారు. కానీ, ఎప్పుడైతే సోషల్ మీడియా హవా ఎక్కువైందో అప్పటి నుంచే మోడీ రాజకీయ గ్రాఫ్ పెరుగుతూ పోయిందని చెప్పారు. ‘‘ట్విట్టర్ లో సెలబ్రిటీలు ఎక్కువగా ఉన్నారు. వారి పేర్లను ఎన్నికలటైంలో మోడీ బాగా వాడుకున్నారు. అది ప్రచారంటైంలో బాగా కలిసొచ్చింది” అని జోయోజీత్ పాల్ అన్నారు. 9000 ట్వీట్లలో 414 సార్లు ఆయన సెలబ్రిటీల పేర్లను ట్యాగ్ చేశారన్నారు. మూడు దశల్లో ఆయన జనానికి చేరువయ్యారని చెప్పారు. తొలిదశలో తనపై ఉన్న మతతత్వ ముద్ర నుంచి బయటపడేందుకు ప్రయత్నించారని, ఇందుకు జాతీయవాదం పేరుతోనే ఎక్కువగా ట్వీట్లు చేశారని చెప్పారు. రెండో దశలో అమితాబ్ బచ్చన్ , ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, సచిన్ టెండూల్కర్ , ఆధ్యాత్మి క గురువు శ్రీశ్రీ రవిశంకర్ పేర్లను ఎక్కువగా వాడుకున్నారన్నారు.2013లో వాళ్లతో కలిసి దిగిన ఫొటోలు, వారి పేర్లను ఎక్కువగా ట్యాగ్ చేశారని చెప్పారు. మూడో దశలోఎన్నికలు అయిపోయాక కూడా వారి పేర్లను బాగానే వాడుకున్నారన్నారు. తన విజయానికి కారణం వాళ్లేనని చెప్పినట్టు గుర్తు చేశారు. ‘స్వచ్ఛ భారత్ ’ను సెలబ్రిటీలతో ముందుకు తీసుకెళ్లారని వివరించారు.

Latest Updates