కరోనా రిస్క్‌‌లో అమెరికన్ యూత్

  • భారీగా బయటికొస్తున్న యువత
  • బార్లు, పబ్బులు, రెస్టారెంట్ల ద్వారా వైరస్ వ్యాప్తి

సెయింట్ పీటర్స్ బర్గ్ (యూఎస్): అమెరికాలో యూత్ కు కరోనా ముప్పు క్రమంగా పెరిగిపోతోంది. అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత బార్లు, రెస్టారెంట్లు ఓపెన్ కావడంతో యువత పెద్దసంఖ్యలో బయటికి వస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుండా, డిస్టెన్స్ పాటించకుండా యూత్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో మిగతా ఏజ్ గ్రూపుల వారి కంటే వీరికే కరోనా ముప్పు ఎక్కువవుతోంది. ముఖ్యంగా 20లు, 30లలో ఉన్నవారిలో పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. మిసిసిపీ స్టేట్ లోని ఆక్స్ ఫర్డ్ సిటీలో సమ్మర్ పార్టీల వల్ల కూడా వైరస్ కేసులు ఒక్కసారిగా ఎక్కువయ్యాయి. ఒక్లహామా సిటీలో చర్చి యాక్టివిటీస్, ఫిట్ నెస్ క్లాసులు, పెళ్లిళ్లు, అంత్యక్రియలు వంటి వాటి వల్ల కూడా యువతలో భారీ ఎత్తున పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అయోవాలో బార్లు రీఓపెన్ కావడంతో కరోనా కేసులు భారీగా పెరిగాయి. లూసియానా స్టేట్ యూనివర్సిటీ దగ్గర్లోని హ్యాంగౌట్లలో దాదాపు 100 మంది కస్టమర్లు, ఎంప్లాయీస్ కు పాజిటివ్ గా తేలింది. మిచిగన్ లోని ఈస్ట్ లాన్సింగ్ లో ఓ పబ్ కు వెళ్లిన 25 మందికి వైరస్ సోకగా, వీరంతా 18 నుంచి 23 ఏళ్ల మధ్యవారే ఉన్నారు. ఫ్లోరిడా, టెక్సాస్, అరిజోనా రాష్ట్రాల్లో సైతం యూత్ పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వస్తున్నారు. మాస్కులు సైతం వాడకుండా తిరుగుతుండటంతో వైరస్ బారిన పడుతున్నారని నిపుణులు చెప్తున్నారు. ఫ్లోరిడాలోని అన్ని కేసుల్లో 31% కేసులు 15 నుంచి 34 ఏళ్లవారే ఉన్నారు. జూన్ మొదట్లో 25% మాత్రమే ఉండగా, తాజాగా కేసులు భారీగా పెరిగాయి.

త్వరలో ఆన్ లాక్ 2.0 గైడ్ లైన్స్

Latest Updates