భారతీయ అమ్మాయి వైద్యానికి రూ.4కోట్ల విరాళం

అమెరికన్ల పెద్దమనసు : భారతీయ అమ్మాయి కోసం రూ.4కోట్ల విరాళం

అప్పటిదాకా అమ్మానాన్నతో హాయిగా నవ్వుకుంది. షాపింగ్ కోసం తిరుగుతూ తమ్ముడికి ముద్దైన ముచ్చట్లు చెప్పింది. వీళ్ల ఆనందాన్ని చూసి కన్ను కుట్టిందేమో. ఆ కుటుంబం రోడ్డు దాటుతుండగా, ఓ రాక్షసుడు కారుతో ఢీ కొట్టాడు. కాలిఫోర్నియాలోని సన్నీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇండియాకు చెందిన 13 ఏళ్ల అమ్మాయి ధ్రుతీ నారాయణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె తండ్రి రాజేశ్, తమ్ముడు ప్రకార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూ దెబ్బలు తాకాయి.

దాడి చేసిన వ్యక్తి ని ఇసయ్యా పీపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గుర్తించారు. రాజేశ్ కుటుంబాన్ని ముస్లింలుగా భావించే అతడీ దారుణానికి ఒడిగట్టాడని విచారణలో తేలింది. ఈ సంఘటన అమెరికన్లను కదిలించింది. ధ్రుతీ ట్రీట్ మెంట్ ఖర్చుల కోసం ‘గో ఫండ్ మీ’లో నిధులను కోరుతూ ఆమె ఫ్యామిలీ, ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెట్టారు. కనీసం రూ.3.47 కోట్లు అవసరమవుతాయని కోరారు. దీంతో వందలాది మంది దాదాపు రూ.4.16 కోట్లు డొనేట్ చేశారు.

Latest Updates