బీహార్‌‌లో పోల్‌ క్యాంపైన్‌ స్టార్ట్‌ చేస్తున్న పార్టీలు

  • వర్చువల్‌ పోల్‌ క్యాంపైన్‌లో అమిత్‌ షా

న్యూఢిల్లీ: బీహార్‌‌లోని మూడు ప్రధాని పార్టీలు బీజేపీ, జనతా దళ్‌ యునైటెడ్‌, రాష్ట్రీయ జనతా దళ్‌ పార్టీలు అసెంబ్లీ పోల్‌ క్యాంపైన్‌ స్టార్ట్‌ చేశాయి. లాక్‌డౌన్‌ కారణంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వర్చువల్‌ క్యాంపైన్‌ స్టార్ట్‌ చేయనున్నారు. ఈ మేరకు 243 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు లక్ష మంది పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి డిటిజల్‌ ర్యాలీలో మాట్లాడనున్నారు. కాగా… రాష్ట్రంలో ప్రతిపక్షమైన రాష్ట్రీయ జనతా దళ్‌ కూడా పోల్‌ క్యాంపైన్‌ను స్టార్ట్‌ చేసింది. ఈ సందర్భంగా వర్చువల్‌ ప్రొటెస్ట్‌ స్టార్ట్‌ చేసింది. ఖాళీ ప్లేట్లను చరుస్తూ తమ నిరసన వ్యక్తం చేసింది. మైగ్రెంట్స్‌ విషయంలో కేంద్రం విఫలమైందని, సీఎం నితీశ్‌ కుమార్‌‌ 75 రోజుల వ్యవధిలో ఒక్కసారి కూడా ప్రెస్‌ మీట్‌ పెట్టలేదని ఆరోపించారు. ఆర్జేడీ లీడర్లు తేజస్వీ యాదవ్‌, రబ్రీదేవీ, తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌లు ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు కూడా రిలీజ్‌ చేశారు.

Latest Updates