అనాథాశ్రమ బాలిక అత్యాచార కేసు విచారణకు ప్రత్యేక కమిటీ

అమీన్ పూర్ అనాథాశ్రమ బాలిక అత్యాచార కేసు విచారణకు కోసం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో ఎస్ సీ పీసీఆర్ సభ్యురాలు అపర్ణ, సీడబ్ల్యూసీ సభ్యురాలు అన్నపూర్ణ దేవి, మహిళ భద్రత విభాగం అధికారి ప్రతాప్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ సునంద సభ్యులుగా ఉన్నారు. వీరంతా నేటి నుంచి విచారణ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆశ్రమ దాత వేణుగోపాల్ రెడ్డి తో పాటు.. ఆశ్రమ నిర్వాహకులపై ఫోక్సో యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. చనిపోయేముందు చిన్నారి తన వాంగ్మూలాన్ని ఇచ్చింది. గత ఏడాది నుంచి తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు చిన్నారి వాంగ్మూలంలో తెలిపింది. ఘటనపై స్పందించిన మహిళా శిశు సంక్షేమ శాఖ అనాథాశ్రమ లైసెన్స్ రద్దు చేసింది. అంతేకాకుండా.. ప్రస్తుతం ఆశ్రమంలో ఉన్న పిల్లలను వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయాలని ఆదేశించింది.

For More News..

ఐస్ క్రీంలో విషం కలిపి చెల్లిని చంపిన అన్న

ట్రక్కుపై రాళ్లు పడి ఇద్దరు మృతి

కరోనాతో వారంలో భార్యభర్తలు మృతి.. హాజరైన మరో 9 మందికి పాజిటివ్

రాష్ట్రంలో 88 వేలు దాటిన కరోనా కేసులు

Latest Updates