అబ్ స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ ఔట్ : IPLలో రెండోసారి

హైదరాబాద్ సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ చాలా ఆసక్తి రేపింది. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ పై … ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. లాస్ట్ ఓవర్ లో జరిగిన డ్రామా మ్యాచ్ కే హైలైట్.

ఢిల్లీ గెలవాలంటే.. 3 బాల్స్ లో 2 రన్స్ కొట్టాలి. హైదరాబాద్ బౌలర్ ఖలీల్ వేసిన ఓవర్ లో.. నాలుగో బంతిని ఆడబోయాడు ఢిల్లీ బ్యాట్స్ మన్ అమిత్ మిశ్రా. అది మిస్సై కీపర్ కు వెళ్లింది. అమిత్ మిశ్రా పరుగందుకున్నాడు. కీపర్ వృద్ధిమాన్ సాహా.. బాల్ ను బౌలర్ ఖలీల్ అహ్మద్ కు విసిరాడు. వెంటనే నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో వికెట్లను కొట్టేందుకు ఖలీల్ ట్రై చేశాడు. ఐతే… ఓ ఎండ్ లోనుంచి రన్ కోసం పరుగు తీసిన అమిత్ మిశ్రా… నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో వికెట్ల ముందు మరో ఎండ్ లోకి వెళ్లాడు. వికెట్లను కొట్టేందుకు ఖలీల్ విసిరిన బాల్.. మిశ్రాకు తాకింది.

దీంతో.. అంపైర్ కు సన్ రైజర్స్ టీమ్ ఫిర్యాదు చేసింది. వికెట్లను కవర్ చేస్తూ.. ఫీల్డర్ ను అడ్డుకున్నాడని తెలిపింది. రివ్యూలో… అమిత్ మిశ్రా ఉద్దేశపూర్వకంగా ఫీల్డ్ ను అడ్డుకున్నట్టుగా తేలడంతో.. అబ్ స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ నిబంధన కింద థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. అమిత్ మిశ్రా అలా పెవీలియన్ చేరాడు.

విజయానికి 2 బాల్స్ లో 2 రన్స్ చేయాల్సిన టైమ్ లో.. తర్వాత బాల్ నే పాల్ 4 కొట్టడంతో.. ఢిల్లీ గెలిచింది. చెన్నైతో క్వాలిఫయర్ 2 మ్యాచ్ కు అర్హత సాధించింది.

IPLలో ఇది రెండోసారి

ఐపీఎల్ లో అబ్ స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ నిబంధన కింద ఓబ్యాట్స్ మన్ ఔట్ కావడం ఇది రెండోసారి.

2013లో పుణె వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో… కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మన్ యూసుఫ్ పఠాన్ కూడా ఫీల్డ్ ను అడ్డుకుని ఔటయ్యాడు.

Latest Updates