వరల్డ్‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌: అమిత్‌‌‌‌ డైరెక్ట్‌‌‌‌ ఎంట్రీ

ఏషియన్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ మెడలిస్ట్​అమిత్‌‌‌‌ పంఘల్‌‌‌‌ సెప్టెంబర్​లో జరిగే వరల్డ్‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌లో ఇండియా జట్టును నడిపించనున్నాడు. ఈ టోర్నీ కోసం బాక్సింగ్ ఫెడరేషన్‌‌‌‌ ఆఫ్ ఇండియా ఎనిమిది మందితో కూడిన టీమ్​ను  ప్రకటించింది. అమిత్‌‌‌‌(52 కేజీ) నేరుగా అర్హత సాధించగా, మిగిలిన ఏడుగురు బాక్సర్లను గత వారం పటియాలలో నిర్వహించిన ట్రయల్స్‌‌‌‌ ద్వారా ఎంపిక చేశారు.

తెలంగాణ బాక్సర్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ హుస్సాముద్దీన్‌‌‌‌ అంపైర్ల వివాదాస్పద నిర్ణయం కారణంగా అవకాశం కోల్పోయాడు. 57 కిలోల విభాగం బౌట్‌‌‌‌లో  హుస్సాముద్దీన్‌‌‌‌పై కవీందర్‌‌‌‌ గెలిచాడు. మనీశ్‌‌‌‌ కౌశిక్‌‌‌‌(63కేజీ),  దుర్యోధన్(69 కిలోలు), ఆశిష్‌‌‌‌ కుమార్‌‌‌‌(75 కేజీ), బ్రిజేష్‌‌‌‌ యాదవ్‌‌‌‌(81 కేజీ), సంజీత్‌‌‌‌(91 కేజీ), సతీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ (+91 కేజీ) జట్టులో చోటు దక్కించుకున్నారు.