అరుణ్ జైట్లీ నాకు మార్గదర్శి: అమిత్ షా

బీజేపీ సీనియర్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ(66)  మృతిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన సంతాపాన్ని తెలిపారు. జైట్లీ మరణం తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. తాను ఒక కుటుంబసభ్యున్ని కోల్పోయానని జైట్లీ తనకు మార్గర్శని చెప్పారు. ఈ రోజు  హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో IPS ఆఫీసర్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న అమిత్ షా… జైట్లీ మృతి విషయం తెలువడంతో హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. పార్టీ నాయకులు, క్యాడర్ హాస్పిటల్ కు చేరుకుంటున్నారు.

Latest Updates