ఏమైనా చేస్కోండి సీఏఏ ఉంటది

కాంగ్రెస్​వి ఓటు బ్యాంకు రాజకీయాలు
సిటిజన్‌‌‌‌‌‌‌‌షిప్ ​సవరణ చట్టంపై చర్చకు రండి
రాహుల్, అఖిలేశ్​లకు అమిత్​ షా సవాల్

లక్నో‘సిటిజన్​షిప్​ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు అపోహలు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ప్రతిపక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా సరే సీఏఏను వెనక్కి తీసుకునే సమస్యే లేదు’ అని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా తేల్చిచెప్పారు. సీఏఏకు మద్ధతుగా ఉత్తరప్రదేశ్​లోని లక్నోలో మంగళవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్​ సహా తృణమూల్, ఎస్పీ, బీఎస్పీలపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్​ల నుంచి వలస వచ్చిన మైనారిటీలకు సిటిజన్​ షిప్​ ఇవ్వాలన్న పార్టీ సీనియర్​ నేతల సలహాలనూ కాంగ్రెస్​ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. దళిత బెంగాలీలకు సిటిజన్​షిప్​ ఇవ్వడానికి మమతా బెనర్జీ అడ్డుచెబుతున్నారని విమర్శించారు.

పౌరసత్వం ఇవ్వడానికే సీఏఏ..

పౌరసత్వం రద్దు చేయడానికి సీఏఏలో ఎలాంటి ప్రొవిజనూ లేదని షా స్పష్టంచేశారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీలు ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలలో భయాందోళనలు రేకెత్తించేలా నిరసనలు చేస్తున్నారని, వాళ్ల నిరసనలకు భయపడి చట్టాన్ని వెనక్కి తీసుకోబోమని తేల్చిచెప్పారు. సీఏఏ విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలని కోరుతూ.. ఈ విషయంలో ఎవరితోనైనా తాను బహిరంగ చర్చకు సిద్ధమని షా వివరించారు. రాహుల్​గాంధీ, అఖిలేశ్​ యాదవ్, మాయావతి, మమతా బెనర్జీలలో ఎవరైనా సరే సీఏఏపై తనతో బహిరంగ చర్చకు రావాలని షా సవాల్​ విసిరారు. నిరసనలు, ఆందోళనలు చేయడం సరికాదని, తనతో చర్చకు వచ్చి సీఏఏలో ఏ ఒక్క క్లాజ్​ అయినా సిటిజన్​షిప్​ రద్దు చేయడానికి అనుకూలంగా ఉందని నిరూపించాలని సవాల్​ విసిరారు.

అక్కడి అరాచకాలు వీరికి కనబడవు

సీఏఏ విషయంలో కాంగ్రెస్​ పార్టీ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని హోంమంత్రి అమిత్​ షా విమర్శించారు. 1947లో మతపరంగా దేశాన్ని రెండు ముక్కలుగా చేయడానికి కాంగ్రెస్​ పార్టీనే కారణమని రాహుల్​ గాంధీ తెలుసుకోవాలని కోరారు. ‘దేశ విభజన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్​లలో హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనుల జనాభా తగ్గిపోతోంది. వాళ్లంతా ఎక్కడికి పోతున్నారు? వాళ్లు హత్యకు గురికావడమో, మతం మార్చుకోవడమో  లేదా మన దేశానికి శరణార్థులుగా రావడమో జరిగింది. అక్కడ వాళ్లపై జరుగుతున్న అరాచకాలు ఈ గుడ్డివాళ్లకు కనిపించట్లేదు’ అని షా మండిపడ్డారు. కేవలం మతం కారణంగా ఆ మూడు దేశాల్లో కోట్లాది మంది హత్యకు గురయ్యారని చెప్పారు. 5 లక్షల మంది పండిట్లు కాశ్మీర్​నుంచి కట్టుబట్టలతో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారని, అప్పుడు ఈ పార్టీలలో ఒక్క పార్టీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని గుర్తుచేశారు. ప్రధాని మోడీ వల్ల ఇంతకాలానికి వాళ్ల బతుకుల్లో మార్పు వస్తోందని చెప్పారు.

డబ్బులిచ్చి ఆందోళనలు చేయిస్తున్నరు: యోగి

సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిపేందుకు ప్రతిపక్షాలు డబ్బులు వెదజల్లుతున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఆరోపించారు. మతపరమైన అణిచివేత కారణంగా పాక్, బంగ్లా, ఆఫ్గాన్​లలో బతకలేక ఎంతోమంది మైనారిటీలు కట్టుబట్టలతో మన దేశానికి వలస వస్తున్నారని చెప్పారు. ‘అధికారంలో ఉన్నపుడు ఇలాంటి వాళ్లను ఆదుకోకపోగా.. ఇప్పుడు మోడీ ప్రభుత్వం వాళ్లను ఆదుకోవాలని ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటోంది’ అంటూ కాంగ్రెస్​పై యోగి మండిపడ్డారు.

3 నెలల్లో రామ మందిరం మొదలెడ్తాం

రామజన్మభూమిలో మందిరం కట్టడానికి సుప్రీంకోర్టు పర్మిషన్​ ఇచ్చిందన్న అమిత్​ షా.. మరో మూడు నెలల్లో అక్కడ ఆకాశాన్ని అంటేలా గుడి కట్టేందుకు పనులు మొదలెడతామని చెప్పారు. దీంతో సభకు హాజరైన జనాలు హర్షధ్వానాలు చేశారు.

RTA యాప్ : సెల్ఫీ అప్​లోడ్​తో బండి రిజిస్టర్​ 

 

Latest Updates