మోడీ బయోపిక్: అమిత్ షా ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రధాని నరేంధ్ర మోడీ బయోపిక్ లో బీజేపీ చీఫ్ అమిత్ షా క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర యునిట్. ఈ సినిమాలో మోడీ పాత్రను బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ నటిస్తున్నాడు. అమిత్ షా పాత్రలో మనోజ్ జోషీ ఒదిగిపోయారు. ఈ చిత్రానికి ‘పీఎం నరేంద్ర మోడీ’ అనే టైటిల్ ను ఫైనల్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ సీఎం గా ఉన్నప్పటినుండి అమిత్ షా పాత్ర కీలకం. గుజరాత్ రాష్ట్ర రాజకీయాలలో మోడీ చెరగని ముద్ర వేసేందుకు అమిత్ కీలకంగా వ్యవహరించారు. 2014 పార్లమెంట్ ఎన్నికలలో కీ రోల్ ప్లే చేసిన అమిత్ షా… మోడీని ఉత్తర్ ప్రదేశ్, వారనాసి నుండి పోటీ చేయించి బీజేపీ భారీ విజయానికి కారకులయ్యారు.

మోడీ బయోపిక్ లో అమిత్ షా పాత్ర ఆసక్తి రేపుతుంది. ఈ సినిమాకు ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 23 భాషల్లో మూవీ రిలీజ్ అవనుంది.

Latest Updates