నామినేషన్‌ దాఖలు చేసిన అమిత్‌ షా

గుజరాత్‌లోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపే జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఇవాళ (శనివారం) నామినేషన్‌ దాఖలు చేశారు. అంతక ముందు నాలుగు కిలోమీటర్ల వరకు ఆయన రోడ్ షో నిర్వహించారు. అమిత్‌షా నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఆయన వెంట కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ఉన్నారు.రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అమిత్‌షా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఇదే మొదటి సారి. నామినేషన్ దాఖలుకు ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అమిత్‌షా ఘననివాళులర్పించారు. తర్వాత అహ్మదాబాద్‌లోని నారన్‌పు ప్రాంతంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు.

Latest Updates