దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి : షా నివాళి

దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా సమర్పణ్ దివస్ పేరుతో బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నాయి. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పాల్గొని నివాళులు అర్పించారు. దీన్ దయాళ్ చూపిన బాటలో నడుస్తున్నామని చెప్పారు. పేదల పరిస్థితి మార్చేందుకు తాము కృషి  చేస్తున్నామని అమిత్ షా అన్నారు. పార్టీ కోసం దీన్ దయాళ్ వేసిన బీజం.. ఇప్పుడు వటవృక్షంగా మారిందన్నారు.

Latest Updates