రాహుల్‌ గాంధీ రాజకీయాలు పక్కన పెట్టు: జవాను తండ్రి సూచన

  • వీడియో ట్వీట్‌ చేసిన అమిత్‌ షా
  • విమర్శలకు గట్టి కౌంటర్‌‌

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బార్డర్‌‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గట్టి కౌంటర్‌‌ ఇచ్చారు. జవాను తండ్రి ఒకరు రాహుల్‌ గాంధీకి సూచనలు చేస్తున్న వీడియోను ట్వీట్‌ చేసి రహుల్‌కు సమాధానం చెప్పారు. “ ధైర్యవంతుడైన ఆర్మీ జవాను తండ్రి రాహుల్‌కు క్లియర్‌‌ మేసేజ్‌ ఇస్తున్నారు. దేశమంతా ఒకటైన వేళ రాహుల్‌ గాంధీ కూడా చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి దేశానికి రక్షణగా నిలవాలి” అని ట్వీట్‌ చేశారు. “ ఇండియన్‌ ఆర్మీ చాలా స్ట్రాంగ్‌, చైనాను కచ్చితంగా ఓడించగలదు. రాహుల్‌ గాంధీ రాజకీయం చేయొద్దు. నా కొడుకు ఆర్మీలో పోరాడాడు. పోరాడుతూనే ఉంటాడు” అని చైనా ఆర్మీ దాడిలో దెబ్బలు తగిలి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న సైనికుడి తండ్రి చెప్తున్న వీడియో ఒకటి వైరల్‌ అయింది. కాగా ఆ వీడియోనే అమిత్‌ షా పోస్ట్ చేసి రాహల్‌ గాంధీకి కౌంటర్‌‌ ఇచ్చారు. గాల్వాన్‌ విషయంలో రాహుల్‌ గాంధీ గత కొద్ది రోజులుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో చెప్పాలని, ప్రభుత్వానికి దాడి గురించి తెలిసినా సైలెంట్‌గా ఉందని ఆయన విమర్శలు చేశారు. ఈ విషయంపై ట్విట్టర్‌‌ ద్వారా ప్రశ్నిస్తూనే ఉన్నారు.

Latest Updates