హైదరాబాద్​ ట్రాఫిక్​ ఎల్​ఈడీకి బిగ్​బీ సలాం!

మన హైదరాబాదీ ట్రాఫిక్ పోలీసుల ఐడియా బిగ్ బీ అమితాబ్ బచ్చన్​కు తెగ నచ్చేసింది. కేబీఆర్ పార్కు వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ జీబ్రా క్రాసింగుల ముందు రంగులు మారే ఎల్ఈడీ లైట్లను జీహెచ్ఎంసీ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. సిగ్నల్ ఇవ్వగానే గ్రీన్, ఆగమంటూ రెడ్, అలర్ట్ చేసేందుకు ఆరెంజ్​ కలర్​లో లైట్లను ఉంచారు. వాటిని చూడగానే వాహనదారులు ఆగడం, జీబ్రా క్రాసింగు మీదుగా జనాలు రోడ్డు దాటడం బిగ్ బీకి నచ్చింది. ‘సూపర్​ ఐడియా’ చాలా మంచి పని చేశారంటూ ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఆఫీసర్లను మెచ్చుకున్నారు.

Latest Updates