బిగ్ బీ సాయం.. వలస కూలీల కోసం 4 విమానాలు ఏర్పాటు

ముంబై: లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల కోసం బాలీవుడు స్టార్ అమితాబ్ బచ్చన్ రియాక్ట్ అయ్యారు. ముంబై నుంచి 700 మంది వలస కూలీలను యూపీలోని వారి సొంతూళ్లకు పంపించేందుకు నాలుగు విమానాలు ఏర్పాటు చేశారు. రైలు బుక్ చేయాలనుకున్నప్పటికీ అధికారికంగా అనుమతులు రాకపోవడంతో ఫ్లైట్స్ బుక్ చేశారని ఆయన సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి. బుధవారం రెండు విమానాలు 180 మంది చొప్పున కార్మికులతో యూపీలోని గోరఖ్ పూర్, వారణాసి, అలహాబాద్ కు చేరుకోగా.. గురువారం మరో రెండు విమానాలు బయల్దేరుతాయని తెలిపాయి. అమితాబ్ బచ్చన్ ఇప్పటికే 10 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి 300 మంది వలస కార్మికులను వారివారి ఇళ్లకు చేర్చారు. ఆయన సాయంపై కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ ఎంతో మంది వలస కూలీల కోసం ప్రత్యేక బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి రియల్ హీరో అనిపించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన బాటలోనే అమితాబ్ కూడా కూలీలను సొంతూళ్లకు చేర్చేందుకు సాయం చేయడం విశేషం.

Latest Updates