హెల్త్‌ వర్కర్స్‌ సేవలను కొనియాడిన అమితాబ్‌బచ్చన్‌

  • ట్వీట్‌ చేసిన అమితాబ్‌ బచ్చన్

న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్‌ వచ్చి ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ హెల్త్‌ వర్కర్లను ఉద్దేశించి సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌‌ చేశారు. “ సహజమైన తెల్లని దుస్తులు వేసుకుని, వారు సేవ చేసేందుకు అంకితం, వారు దేవుడి అవతారంలో ఉన్నారు. అహాన్ని చెరిపేసి మన సంరక్షణ స్వీకరించారు. వారు మానవత్వం జెండాను ఎగరేస్తున్నారు” అంటూ అమితాబ్‌ బచ్చన్‌ ట్వీట్‌ చేశారు. కరోనా పాజిటివ్‌ రావడంతో అమితాబ్‌బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా.. ఐశ్వర్య రాయ్‌, ఆమె కూతురు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు.

Latest Updates