కరోనా ఎఫెక్ట్.. అమితాబ్ చేతిపై క్వారంటైన్ స్టాంప్

బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన లెఫ్ట్ హ్యాండ్ పై హోమ్ క్వారంటైన్ స్టాంప్ వేయించుకున్నారు. స్టాంపు తో ఉన్న తన చేతిని ఫోటో తీసి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.  ముంబైలో ఓటర్ సిరాతో స్టాంప్ వేయడం స్టార్ట్ చేశారని..సురక్షితంగా ,జాగ్రత్తగా ఉండండి వైరస్ లక్షణాలు గుర్తిస్తే  సింగిల్ గా ఉండండి అంటూ ట్వీట్ చేశారు. కరోనా నియంత్రణలో భాగంగా మహారాష్ట్రలో కరోనా అనుమానితులకు లెఫ్ట్ హ్యాండ్ పై హోమ్ క్వారంటైన్  స్టాంప్ ను వేస్తుంది ప్రభుత్వం. అనుమానితుల కోసం ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అమితాబ్ బచ్చన్ హోమ్ క్వారంటైన్ స్టాంప్ వేసుకుని ఇలా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు.

Latest Updates