రిటైర్మెంట్ ప్రకటించిన అమితాబ్

బిగ్ బీ అమితాబ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాల్లో నటించబోనంటూ రిటైర్మెంట్ ప్రకటించారు. చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తన పర్సనల్ బ్లాగ్ లో  తెలిపారు. ప్రస్తుతం అలియా భట్, రణబీర్ కపూర్‌ ల కొత్త మూవీ “బ్రహ్మాస్త్ర” షూటింగ్ కోసం మనాలికి వెళ్లిన అమితాబ్, తన బ్లాగ్ లో…” శరీరం విశ్రాంతి కోరుకుంటుందని, ఇన్నాళ్ల పాటు గడిపిన సినీ వాతావరణం కాకుండా.. మరొక కొత్త వాతావరణాన్ని మనసు కోరుకుంటుందని” తెలిపారు. పదవీ విరమణ చేయాల్సిన సమయమిదని అన్నారు. తల ఒకటి ఆలోచిస్తుంటే..వేళ్లు మరొకటి ఆలోచిస్తున్నాయని అన్నారు.

ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో వందలకొద్దీ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు అమితాబ్. తన నట ప్రస్థానంలో నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు. దాంతో పాటు మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

Amitabh Bachchan Says His Body is Sending Him the Message to Retire

Latest Updates