అమితాబ్ జుంద్ చిత్రం టీజర్ విడుదల

బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్  నటిస్తున్న జుంద్ సినిమా టీజర్  విడుదలైంది. టీజర్లో పిల్లలు బ్యాట్లను పట్టుకుని ముందుకు వెళుతున్న సీన్… ఈ సీన్ లో బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఆకట్టుకుంటోంది. ఈ మూవీని ఫుట్ బాల్ కోచ్ విజయ్ బర్సే రియల్ లైఫ్ ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ నిన్న విడుదల చేసింది.

బర్సే నాగపూర్ లో స్లమ్ సాకర్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మురికివాడల్లో నివసించే పిల్లలకు ఫుట్ బాల్ క్రీడలో మెళుకువలను నేర్పించారు. అదే కథాంశంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లుగా దర్శకుడు నాగరాజ్ మంజులే తెలిపారు. పిల్లలను ఫుట్ బాల్ ప్లేయర్లుగా తీర్చిదిద్దే క్రమంలో బర్సేకు ఎదురైన కష్టాలను అధిగమించిన తీరును సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులు చూడనున్నారు. అమితాబ్ ప్రధాన పోషిస్తున్న ఈ సినిమా మే 8న విడుదల కానుంది.

Latest Updates