అమర జవానుల కుటుంబాలకు బిగ్ బీ సాయం

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా పుల్వామా దాడిలో అసువులు బాసిన వీరజవాన్ల కుటుంబాలకు ఆర్ధిక సాయం ప్రకటించారు. దాడిలో చనిపోయిన 49 మంది జవానుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 2.5 కోట్లు విరాళం ప్రకటించారు.

గతంలో కూడా అమితాబ్ మహారాష్ట్రకు చెందిన 350 మంది రైతుల లోన్స్‌ని మాఫీ చేయించాడు. ఉత్తర ప్ర‌దేశ్‌లోని రైతు కుటుంబాల‌కి చెందిన వారి లోన్స్ మాఫీ కోసం అమితాబ్ 4.05 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టారు.

ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ అధికారిక ప్రతినిథి కూడా స్పష్టం చేశారు. ఆయన అమరుల కుటుంబాలకు ఈ విరాళాన్ని అందజేసేందుకు సరైన ప్రాసెస్ ను తెలుసుకుంటున్నారని తెలిపారు.

Latest Updates