అమితాబ్ ట్వీట్ వైరల్: మ‌హిళ‌ల క్రికెట్ టీమ్‌ ను త‌యారు చేస్తున్నారు

టీమిండియా కెప్టెన్‌‌ విరాట్ కోహ్లి, నటి అనుష్క శర్మకు సోమవారం పండంటి పాప జన్మించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కోహ్లి స్వయంగా ట్విట్టర్, ఇన్‌ స్టాగ్రామ్‌ వేదికగా తెలిపాడు. దీంతో సెలబ్రిటీల నుంచి అభిమానుల వరకు విరుష్క జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌న క్రికెట్ టీమ్ అంతా క‌లిసి భ‌విష్య‌త్తులో మ‌హిళ‌ల క్రికెట్ టీమ్‌ను త‌యారు చేస్తోందంటూ బిగ్ బీ ఫన్నీ ట్వీట్ చేశాడు. ఇందులో క్రికెట‌ర్లంద‌రికీ కూతుళ్లే పుట్టారంటూ వ‌రుస‌గా ఒక్కొక్క‌రి పేరు రాసుకుంటూ వెళ్లాడు. ధోనీ కూతురు ఈ టీమ్‌ కు కెప్టెన్‌ గా ఉంటుందేమో అని కామెంట్ చేశాడు.

ఆ లిస్ట్‌ లో వ‌రుస‌గా రైనా, గంభీర్‌, రోహిత్‌, ష‌మి, ర‌హానే, జ‌డేజా, పుజారా, సాహా, భ‌జ్జీ, న‌ట‌రాజ‌న్‌, ఉమేష్ యాద‌వ్‌ల పేర్లు ప్రస్తావించాడు. ఇప్పుడు కోహ్లికి కూడా కూతురే పుట్టిందంటూ.. వీళ్లంతా భ‌విష్య‌త్తు మ‌హిళ‌ల క్రికెట్ టీమ్‌ ను త‌యారు చేస్తున్నార‌ని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై అభిమానులు సరాదాగా రీట్వీట్స్ చేస్తున్నారు.

Latest Updates