అవార్డుల వేడుకకు రాలేకపోతున్న: అమితాబ్

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కావడం లేదని తెలిపారు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్. రెండు మూడు రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నట్లు బిగ్ బీ ట్విట్టర్ లో తెలిపారు.

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో వేడుకగా జరుగనుంది. ఈ వేడుకలో నటీనటులకు జాతీయస్థాయిలో అవార్డులను అందజేయనున్నారు. అంతేకాక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును కూడా ఇవ్వనున్నారు. అయితే నటుడు అమితాబ్ బచ్చన్‌‌ను కేంద్రం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించనుంది. ఇవాళ జాతీయ అవార్డులో భాగంగా కేంద్రం ఈ అవార్డులను ప్రధానం చేయనుంది. అయితే జ్వరం కారణంగా ముంబై నుంచి ఢిల్లీకి జర్నీ చేయలేనని తెలిపారు అమితాబ్.

జాతీయ చలన చిత్ర అవార్డులను రాష్ట్రపతి అందజేయడం ఆనవాయితీ. ఈ సారి ఈ అవార్డులను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా అందజేయనున్నారు.

Latest Updates