గ్రాండ్ గా అమితాబ్ బర్త్ డే వేడుకలు

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ 77వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయన ఇంటి ముందు సందడి చేశారు. అమితాబ్ సినిమా పాటలకు వీరాభిమానులు డ్యాన్సులు చేశారు. గత కొన్నేళ్లుగా ఇలాగే వస్తున్నామని చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీ నుంచి అమితాబ్ వేషధారణతో ఉన్న వ్యక్తి కూడా వచ్చి కాసేపు అభిమానుల్లో జోష్ నింపాడు. కోల్హాపూర్ నుంచి వచ్చిన ఓ అభిమాని ఐస్ తో 77 అనేలా చెక్కి విషెస్ చెప్పాడు.

Latest Updates