రాహుల్ ఓటమి ఖాయం.. అందుకే కేరళకి పరుగు: షా

అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమైందని అన్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా. ఆదివారం ఉత్తర ప్రదేశ్.. దంపూర్ లోని బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా.. అమేథీ నియోజక వర్గానికి రాహుల్ చేసిన అభివృద్ధి ఏమీలేదని అన్నారు. అందుకే ఉత్తర ప్రదేశ్ నుంచి కేరళకు పారిపోతున్నారని అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల ద్వారా రాహుల్ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

మునిగే నౌకకు కెప్టెన్ రాహుల్: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్

మునిగే నావకు రాహుల్ గాంధీ కెప్టెన్ అని విమర్శించారు బీజేపీ నాయకులు, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. అమేథీలో ఓటమి భయంతో.. కేరళకు వెళ్తున్న రాహుల్.. ముందుగా శబరిమలపై తన స్టాండ్ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. వయనాడ్ లో 49 శాతం హిందువులు ఉన్నారని,  మిగితా అంతా మైనార్టీలేనని అందుకే వయనాడ్ ఎంపిక చేసుకున్నారని విమర్శించారు రవిశంకర్ ప్రసాద్.

Latest Updates