నేడు తెలంగాణలో అమిత్ షా షెడ్యూల్..

హైదరాబాద్‌‌, వెలుగు: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం రాష్ట్రానికి రానున్నారు. కరీంనగర్, వరంగల్‌ లో జరిగే బహిరంగ సభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ వేదికగా పార్టీ లోక్‌‌సభ అభ్యర్థి బండి సంజయ్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తారని పార్టీ నేతలు చెప్పారు. తర్వాత మధ్యాహ్నం 1 గంటకు హన్మకొండ జేఎన్ఎం కాలేజ్ గ్రౌండ్స్ లో చింతా సాంబమూర్తికి ఓటేసి లోక్ సభకు పంపించాలని కోరతారని అన్నారు. ఈ పర్యటనలో అమిత్ షా వెంట పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తో పాటు రాష్ట్ర, జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని అన్నారు.

Latest Updates