మమత హింసతో గెలవాలనుకుంటున్నారు: అమిత్ షా

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. బెంగాల్ లో మమతా బెనర్జీ హింసతో గెలవాలనుకుంటున్నారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న హింసపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ర్యాలీలో టీఎంసీ కార్యకర్తలు తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. నిన్నటి ర్యాలీలో సీఆర్పీఎఫ్  లేకుంటే తనకు రక్షణ ఉండేది కాదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 300 సీట్లు గెలుస్తుందని .. పశ్చిమ బెంగాల్ లో 23 సీట్లు గెలుస్తుందన్నారు. మమత పరిపాలనకు మే 23 న ప్రజలు చరమగీతం పాడుబోతున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ సరళిపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని విమర్శించారు. బెదిరింపు ప్రకటనలు చేస్తున్న మమతా బెనర్జీపైన  ఈసీ చర్యలు తీసుకోవడం లేదన్నారు అమిత్ షా.

Latest Updates