వారసుడి ఎంపిక కోసం రంగంలోకి అమిత్​షా

న్యూఢిల్లీ: బీజేపీలో అమిత్​షా వారసుడి ఎంపిక కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీ అంతర్గత ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల13న పార్టీ నేషనల్​ఆఫీసు బేరర్లతో 14న పార్టీ రాష్ట్ర అధ్యక్షులతో షా భేటీ కానున్నారు. పార్టీ చీఫ్​ పదవి తర్వాత ముఖ్యమైన జనరల్​ సెక్రటరీ ఇన్​చార్జి ఎంపిక పైనా కసరత్తు జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే షా పదవీ కాలం పూర్తయింది. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో పదవిలో కొనసాగాలంటూ పార్టీ కోరింది. కేంద్ర కేబినెట్​లో చేరిన అమిత్​షా.. పార్టీ చీఫ్​గా కొనసాగే అవకాశంలేదని సమాచారం. త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం ఆయా రాష్ట్రాల బాధ్యులతో షా తరచుగా సమావేశ మవుతున్నారు. ఓవైపు ఈ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తూనే.. పార్టీ అంతర్గత ఎన్నికలకు షా గ్రౌండ్​ప్రిపేర్​చేస్తున్నారు. అయితే, పార్టీ చీఫ్​ఎన్నికకు సంబంధించి బీజేపీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. షా తప్పుకుంటే ఆయన స్థానానికి జేపీ నడ్డా, భూపేందర్​యాదవ్​వంటి సీనియర్లు పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Latest Updates