అమర జవాన్ల ఫ్యామిలీకి అమితాబ్ సాయం

amithab-bachan-help-crpf-families

అమితాబ్ బచ్చన్ ఆ ఒక్క సాయాన్ని కూడా ఫినిష్ చేసి, అందరిచేత రియల్ హీరో అనిపించుకుంటున్నారు. మొన్న 2వేల మంది రైతుల రుణాలను తీర్చిన బిగ్ బీ..నేడు పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ జవానుల కుటుంబాలకు ఇస్తానన్న సాయాన్ని అందిచారు.  ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవానుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నగదును ఆయన గురువారం అందజేశారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ స్వయంగా తన బ్లాగులో తెలిపారు.

Latest Updates