అమిత్ షా రోడ్ షో.. కాషాయమయమైన రోడ్లు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో కొనసాగుతోంది.  జై శ్రీరాం, భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తుతోంది. సందర్బంగా వీధులన్ని కిక్కిరిసిపోయాయి. కార్యకర్తలంతా కాషాయ తలపాగాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళలు కూడా బోనాలుతో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారాసీగూడ నుంచి మొదలైన రోడ్ షో నెమ్మదిగా ముందుకు సాగుతోంది. వేలాదిగా కార్యకర్తలు హాజరవడంతో.. ర్యాలీ స్లోగా మూవ్ అవుతోంది. మోడీ మోడీ అంటూ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగుతోంది. బిల్డింగుల పై నుంచి అమిత్ షాపైకి పూల వర్షం కురిపిస్తున్నారు స్థానికులు. అమిత్ షా తో పాటు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయా అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, గ్రేటర్ ఎన్నికల ఇంచార్జి భూపేంద్రయాదవ్.. ఇతర నేతలు ఉన్నారు.

Latest Updates