రేపు ప్రయాగరాజ్ కు అమిత్ షా : భారీ త్రిశూల పూజ

యూపీ : ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ కు రేపు బుధవారం వెళ్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. అర్థ కుంభమేళాలో భాగంగా ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో ఆయన పవిత్ర స్నానం చేస్తారు. భారీ స్థాయిలో జరిగే త్రిశూల పూజలో పాల్గొంటారు. జునా అఖాడా కు చెందిన యుజగిరి దేవాలయాన్ని సందర్శిస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.  ఆ తర్వాత.. 13 అఖాడాలకు సంబంధించిన సన్యాసులు, పూజారులు, మహాత్ములతో ఆయన చర్చలు జరుపుతారు.

Latest Updates