న‌టి, ఎంపీ న‌వ‌నీత్ కౌర్ కు క‌రోనా పాజిటివ్

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌ముఖుల‌ను సైతం వ‌ద‌ల‌ట్లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలామంది లోక్ సభ సభ్యులు, మంత్రులు కరోనా బారిన పడ్డారు. తాజాగా సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు కూడా కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. ఆమెతో పాటు ఆమె కుటుంబంలో మ‌రో 11 మంది కరోనా బారిన పడ్డారు. మొదట ఆమె మామ గంగాధర్ రానాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె కుటుంబం మొత్తం హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దాదాపు 60 మంది సభ్యులు, కార్యకర్తలకు కరోనా పరీక్షలు చేశారు. నవనీత్ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నటిగా ఎన్నో సినిమాల్లో నటించిన నవనీత్ గత సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 36 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

MP Navneeth kaur rana tests positive for covid-19

 

 

Latest Updates