ఏపీ భవన్​లో అమరావతి బోర్డు తొలగింపు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని ఏపీ భవన్ లో అమరావతి బోర్డును అధికారులు ఆదివారం తొలగించారు. టీడీపీ హయాంలో సంక్రాంతి సంబరాలు నేపథ్యంలో ఐ లవ్ అమరావతి అని విద్యుత్ కాంతులతో కూడిన బోర్డు ను ఏర్పాటు చేశారు.  రాజధానిని అమరావతి నుంచి తరలించాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల విధానపరమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ భవన్ లో అమ‌రావ‌తి బోర్డును తొల‌గించిన‌ట్టు స‌మాచారం. కోతుల బెడద కారణంగా బోర్డు తొలగించాల్సి వచ్చిందని ఓ అధికారి చెప్పారు.

see also: కమలం గ్రాఫ్​ పెరిగింది

see also: పాల సేకరణ ధర రూ.2 పెరిగింది

see also: ఈరోజే చైర్‌‌ పర్సన్లు, మేయర్ల ఎన్నిక

see also: ‘హంగ్​’లలో ఎక్కువ టీఆర్​ఎస్​ చేతికి?

Latest Updates