నన్ను, కూతురిని వేధించేందుకు ప్రయత్నించారు: షమీ భార్య

గృహహింస కేసులో ఇండియన్ క్రికెటర్ మహమ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ కావడంపై ఆయన భార్య హసీన్ జహన్ ఆనందం వ్యక్తం చేసింది. తాను న్యాయం కోసం ఏడాదిపైగా పోరాడనని, కోర్టు ఇచ్చిన తీర్పుతో న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగిందని ఆమె అన్నారు.

తాను బెంగాల్ కు చెందినదాన్ని కాకపోయుంటే,  మమతా బెనర్జీ బెంగాల్  సీఎం అవ్వకపోయుంటే..  తాను ఇక్కడ సురక్షితంగా ఉండేదాన్ని కానంటూ..  హసీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమ్రా(యూపీ) పోలీసులు తనను, తన కూతురిని వేధించేందుకు ప్రయత్నించారని, దేవుడి దయ వల్ల వాళ్లు ఆ విషయంలో సక్సెస్ కాలేదని హసీన్ అన్నారు. షమీ ఓ  క్రికెటర్ కావడంతో.. తనకు తాను ఏదో గొప్పగా ఫీలవుతుంటాడని ఆమె వ్యాఖ్యానించింది.

పలువురు అమ్మాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో  షమీ భార్య హసీన్ జహాన్ అతనిపై కేసు పెట్టింది. గత ఏడాది ఐపీఎల్‌కు ముందు గృహహింస కేసు కూడా పెట్టింది. దాంతో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద కోల్ కతా పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు.

Latest Updates