మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడు

తన తండ్రి మారుతీరావు ఆత్మహత్య  చేసుకునేంత పిరికివాడు కాదని చెప్పింది అమృత. ఆత్మహత్యకు ఆస్తి వివాదాలే కారణమై ఉండొచ్చని చెప్పింది. తన బాబాయి శ్రవణ్ కి, తండ్రి కి మధ్య ఆస్తి గొడవలున్నాయని ఆమె చెప్పింది, ఆ కారణంగా చనిపోయి ఉండొచ్చని సంచలన వ్యాఖ్యలు చేసింది.

మారుతీరావు మృతిపై అమృత మీడియాతో మాట్లాడుతూ.. ఒక మనిషిని చంపించిన వ్యక్తి  సూసైడ్ చేసుకుంటాడంటే వేరే కారణలు కూడా ఉండొచ్చని చెప్పింది. తన తండ్రి మారుతీరావుపై ప్రణయ్ ని చంపాడన్న కోపం తప్ప మరే కోపం లేదని చెప్పింది. తన తండ్రి దేని వల్ల సూసైడ్ చేసుకున్నారో తెలియదని, పశ్చాత్తాపంతో చనిపోయాడని అనుకోవడం లేదని చెప్పింది.

అమ్మకు ప్రాణహాని..

భవిష్యత్తులో బాబాయి నుంచి అమ్మకు ప్రాణహాని ఉంటుందని అమృత ఆరోపించింది. శ్రవణ్‌ రెచ్చగొట్టడం వల్లే మారుతీరావు తప్పు చేశాడనుకుంటున్నానని అనుమానం వ్యక్తం చేసింది. ప్రణయ్ లేకపోయినా.. తనకంటూ ఓ ఫ్యామిలీ ఉందని,  అత్త, మామా,కొడుకు అందరూ ఉన్నారని చెప్పింది. అమ్మ తన దగ్గరకు వస్తే సంతోషంగా  చూసుకుంటానని, తాను మాత్రం అక్కడికి వెళ్ళనని అమృత చెప్పింది.

Amrutha Comments on her father maruthi rao suicide

Latest Updates