మర్డర్ సినిమా విడుదల నిలిపివేతపై అమృత పిటిషన్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై  అమృత న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘మర్డర్’ సినిమా నిర్మిస్తుండటం… ట్రైలర్, కొత్తగా విడుదలైన పాటలో వాస్తవానికి దూరంగా ఉన్న అంశాలను చూపించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలకు దూరంగా ‘మర్డర్’‌ సినిమాను తెరకెక్కిస్తున్నారని అమృత ఆరోపించారు. వెంటనే ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ  నల్గొండ జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు.

అమృత పిటిషన్‌ను కోర్టు… ఎస్సీ ఎస్టీ కోర్టుకు ఫార్వర్డ్ చేసింది. దీనిపై స్పందించిన కోర్టు ఈ నెల 6న ‘మర్డర్’ సినిమా దర్శక నిర్మాతలు కోర్టుకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో అడ్వకేట్‌ ఈమెయిల్, వాట్స్అప్ ల ద్వారా దర్శక నిర్మాతలకు నోటీసులు పంపారు.

Latest Updates