సినిమా దర్శకులు, నిర్మాతలు జీవితాలతో చెలగాటమాడుతున్నారు: అమృత ప్రణయ్‌

  • మర్డర్‌‌ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అమృత

మిర్యాలగూడ, వెలుగు: తమ అనుమతి లేకుండా.. తమ పేర్లు, జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా మర్డర్‌‌ సినిమా తీసి జీవితాలపై ప్రభావం చూపుతున్నారని అమృత ప్రణయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా తీయడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన రిలీజ్‌ చేశారు. మర్డర్‌‌ స్టోరీలో తమ పేర్లు, ఫొటోలు వాడుకున్నందుకు, సినిమాను నిలిపేయాలని కోరుతూ పోయిన నెల 29న నల్గొండ కోర్టులో సూట్‌ ఫైల్‌ చేసినట్లు చెప్పారు. ఈ మేరకు సినిమా దర్శకుడు, నిర్మాతకు కోర్టు నోటీసులు ఇచ్చిందని, వాట్సాప్‌, మెయిల్‌ ద్వారా వాటిని పంపిందని అన్నారు. దీనిపై ఈ నెల 6న నల్గొండ కోర్టులో విచారణ ఉందని, సినిమా దర్శకుడు, నిర్మాత విచారణకు హాజరు కావాల్సి ఉందని అమృత చెప్పారు. రెండేళ్లుగా మానసిక ఒత్తిడికి గురవుతున్న తనను ఈ సినిమా తీసి ఇంకా మనో వేదనకు గురి చేస్తున్నారని, ఇది ఏమ మాత్రం సరికాదని, జీవితాలతో చెలగాటం ఆడటం మంచిదికాదని చెప్పారు. మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్య, మారుతిరావు ఆత్మహత్యకు సంబంధించి సంఘటనల ఆధారంగా మర్డర్‌‌ సినిమా తీస్తున్నట్లు రామ్‌గోపాల్‌ వర్గ ప్రకటించారు. ఈ మేరకు దాని టీజర్‌‌ను కూడా ఇటీవల రిలీజ్‌ చేశారు.

Latest Updates