కిడ్నాప్ అయిన చిన్నారికి కరోనా వైరస్ : క్వారంటైన్ లోకి 22మంది

హైదరాబాద్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ముంబైకి చెందిన ఓ మహిళ తన కుమారుడితో కలిసి నగరంలో నివాసం ఉంటుంది. అయితే బుధవారం తన 18నెలల కొడుకును ఎవరో కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

గాలింపు చర్యల్లో సీసీటీవీ పుటేజీ ఆధారంగా కిడ్నాపర్ ఇబ్రహీంను అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన పిల్లలు అనారోగ్యంతో చనిపోతున్నారని, తన భార్య కొడుకు కావాలని కోరడంతో కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకొన్నాడు. అయితే వైద్య పరీక్షలు చేయగా కిడ్నాప్ అయిన చిన్నారికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో చిన్నారితో డైరక్ట్ కాంటాక్ట్ అయిన పోలీసులు డాక్టర్లు, కిడ్నాపర్ తో పాటు మొత్తం 22మందిని క్వారంటైన్ కు తరలించారు.

మరోవైపు బాధితురాలికి మద్యం సేవించే అలవాటు ఉందని, ఆత్మరక్షణకోసం చిన్నారిని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.

Latest Updates