అంబులెన్స్​ రాక.. బైక్​పై నిండు గర్భిణి

ఆసిఫాబాద్, వెలుగు: అంబులెన్సు అందుబాటులో లేక గర్భిణిని 7 కి.మీ. బైక్​పై తీసుకెళ్లిన సంఘటన ఆసిఫాబాద్​ జిల్లాలో ఆదివారం జరిగింది. వాంకిడి మండలం సోనాపూర్ గ్రామానికి చెందిన సిడాం భీంబాయి గర్భిణి. నెలలు నిండి కడుపు నొప్పి రావడంతో భర్త భీంరావ్ 108 వాహనానికి ఫోన్​ చేశారు. రావడానికి మూడు గంటలు పడుతుందని వారు చెప్పారు. వెంటనే స్థానిక హాస్పిటల్​లో ఉన్న అంబులెన్స్​కోసం ఫోన్​చేయగా డ్రైవర్​ లేడని సమాధానం ఇచ్చారు. ఏం చేయాలో తోచక బైక్​పైనే సుమారు 7 కిలోమీటర్ల దూరంలోని వాంకిడి ప్రభుత్వ దవాఖానాకు బయలుదేరారు. మార్గమధ్యలో ఆమెకు రక్తస్రావమైంది. చివరికి వాంకిడి ప్రభుత్వ హాస్పిటల్​కు వెళ్లేసరికి అక్కడా నిరాశే ఎదురైంది. డాక్టర్ అందుబాటులో లేడు. నర్సులే ఆమెకు చికిత్స చేశారు. భీంబాయికి సాధారణ ప్రసవం జరిగింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది.


Latest Updates