ఏనుగులకు 5 కోట్ల ఆస్తి రాసిచ్చిన జంతు ప్రేమికుడు

బీహార్ జంతు ప్రేమికుడి వీలునామాపై పొగడ్తలు

పాట్నా: బీహార్ లోని ఓ వ్యక్తి జంతువులపై ప్రేమను చాటుకున్నాడు. రూ.5 కోట్ల విలువైన భూములు, ఇతర ఆస్తులను తాను పెంచుకుంటున్న రెండు ఏనుగులకు చెందేలా వీలునామా రాశాడు. అక్తర్ ఇమామ్ అనే వ్యక్తి ఏషియన్ ఎలిఫెంట్ రీహాబిలిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ ఎనిమల్ ట్రస్ట్
చీఫ్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఆయనకు 12 ఏళ్లున్నప్పటి నుంచి మోతి, రాణి అనే రెండు ఏనుగులను పెంచుకుంటున్నాడు. వీటిని తన ఫ్యామిలీ మెంబర్లుగా చూసుకుంటున్న అక్తర్… అవి లేకుండా తాను బతకలేనని చెబుతాడు. ఒకవేళ ఏనుగులు మరణిస్తే తాను రాసిచ్చిన
ఆస్తి ట్రస్టుకు చెందుతుందని తెలిపాడు. ఈ మధ్యనే కేరళలో గర్భిణి ఏనుగు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇలాంటి సమయంలో అక్తర్ ఈ నిర్ణయం తీసుకోవడంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు . ‘‘ఇలాంటి మనుషులు అరుదుగా ఉంటారు. కానీ ఆయన చేసిందే కరెక్టు. మనుషుల కంటే జంతువులే బెటర్” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

అనాథలుకావొద్దనే…
‘‘ఒకరోజు నాపై మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఆ సమయంలో ఏనుగులే నన్ను కాపాడాయి. దుండగులు పిస్తోళ్లతో నా రూమ్ లోకి వచ్చేందుకు ప్రయత్నించగా, ఏనుగులు అరవడం ప్రారంభించాయి. దీంతో నేను నిద్ర లేచి చూడగానే దుండగులు పారిపోయారు. జంతువులు మనుషుల్లా కాకుండా నమ్మకమైనవి. ఏనుగుల సంరక్షణ కోసం నేను ఏళ్లుగా పని చేస్తున్నాను . నేను చనిపోయిన తర్వాత నా ఏనుగులు అనాథలు కావొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నాను ” అని అక్తర్ చెప్పాడు.

ఫ్యామిలీ నుంచి థ్రెట్..
భూమిని ఏనుగుల పేరిట రాసిన అక్తర్..తనకు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి థ్రెట్ ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో భార్య, కొడుకులు పదేండ్లుగా తనకు దూరంగా ఉంటున్నారని చెప్పాడు. ఇంతకుముందు కొడుకు తనపై తప్పుడు కేసు పెట్టాడని, కానీ అది నిలవలేదన్నాడు. స్మగ్లర్లకు ఏనుగులను కూడా అమ్మేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నానని అక్తర్ వివరించాడు.

For More News..

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్

జనాలకే కరోనా రూల్స్.. లీడర్లకు కాదు..

డ్యూటీకి రాకపోతే ఫైన్!

Latest Updates