లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి గుహలోనే ఉన్న ఇంజినీర్

కరోనా వైరస్ కేసులు పెరుగుతండటంతో దేశంలో లాక్డౌన్ విధించాలని ప్రధాని మోడీ భావించారు. అందుకనుగుణంగా మార్చి 22న లాక్డౌన్ ప్రకటించారు. అది ఏప్రిల్ 14 వరకు అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. అయితే ఏప్రిల్ 14 మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మోడీ.. కరోనా తీవ్రత పెరుగుతండటంతో మళ్లీ లాక్డౌన్ ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

అయితే ఈ లాక్డౌన్ వల్ల దేశం మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. ఆ విధంగానే ముంబాయికి చెందిన వీరేంద్ర సింగ్ డోగ్రా కూడా మధ్యప్రదేశ్ లోని ఒక గుహలో చిక్కుకుపోయారు. ఆయన మధ్యప్రదేశ్ లోని అమర్ కంటక్ నుంచి గుజరాత్ లోని నర్మదానది వరకు కాలినడకన వస్తానని మొక్కకున్నాడు. అందుకే అలా బయలుదేరాడు. అక్కడి ప్రజలకు ఇలా నడకన వెళ్తే మంచి జరుగుతుందని నమ్మకం. అయితే లాక్డౌన్ ప్రకటించేనాటికి వీరేంద్ర కువాండేవ్రి అనే గ్రామానికి.. అక్కడ చిక్కుకుపోయాడు. ఎటువెళ్లాలో తెలియని వీరేంద్ర అక్కడే ఉన్న ఒక గుహలోకి వెళ్లి తలదాచుకున్నాడు.

ఆదివారం సాయంత్రం కువాండ్రేవి గ్రామస్థులు పశువులు కాస్తూ ఆ గుహ వైపు వెళ్లారు. అక్కడ వీరేంద్రను చూసి వారంతా షాకయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు తెలిపారు. పోలీసులు గుహ వద్దకు చేరుకొని వీరేంద్రను విచారించారు. తాను ముంభైలో సాఫ్ట్‌వేర్ గా పనిచేస్తున్నానని.. లాక్డౌన్ మొదలయ్యే నాటికి తాను ఇక్కడి వరకు చేరుకున్నానని.. ఎటు వెళ్లాలో తెలియక ఈ గుహలో ఉన్నట్లు వీరేంద్ర తెలిపాడు. వీరేంద్ర వద్ద కొన్ని బట్టలు, మహాభారత పుస్తకం మాత్రమే ఉన్నాయి. గుహలో తాను మహాభారతం చదువుకుంటూ గడిపినట్లు వీరేంద్ర తెలిపాడు. అతనిచ్చిన సమాచారం మేరకు పోలీసులు అతని బంధువులను పిలిపించి వీరేంద్రను వారికి అప్పగించారు.

For More News..

రోడ్డెక్కినందుకు ఆపిన పోలీసులు.. స్పాట్ లోనే చనిపోయిన యువకుడు

కరోనా మీద కోపంతో నెట్లో ఏం వెతుకుతున్నారో తెలుసా..

కరోనాను జయించిన 102 ఏళ్ల వృద్ధురాలు

Latest Updates