పోలీసులపై దాడి చేసిన మతిస్థిమితం లేని యువకుడు

బంజారాహిల్స్ లో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. మతిస్థిమితం లేని ఓ యువకుడు రోడ్ నంబర్ 3లో వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తూ.. వచ్చిపోయే ప్రయాణికులను రాళ్లతో కొట్టే ప్రయత్నం చేశాడు. తీవ్ర భయాందోళనకు గురైన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులపై కూడా దాడికి దిగాడు ఆ వ్యక్తి. కొద్దీ సేపు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు.. దీంతో ఆ వ్యక్తిని తాడుతో కట్టేసి ఆటోలో పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. దాదాపు గంట సేపు రోడ్డు పై హంగామా చేసాడు.  అక్కడ కొద్దీ సేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. తర్వాత పోలీసులు అతడిని తాడుతో కట్టేసి పోలీస్టేషన్ కు తరలించారు.