Video Viral: వావ్.. ఏం ఐడియా తాత.. నీ బుర్రే బుర్ర

Video Viral: వావ్.. ఏం ఐడియా తాత.. నీ బుర్రే బుర్ర

ఎవరైనా తమ తెలివి తేటలు ఉపయోగించి ఏదైనా కొత్తగా ప్రయత్నించినపుడు అలాంటి వారిని అభినందించకుండా ఉండలేం. వారి ట్యాలెంట్‌ను, క్రియేటివిటీని (Creative Videos) మెచ్చుకోకుండా ఉండలేం. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోల ద్వారా చాలా మంది ప్రతిభ వెలుగులోకి వస్తోంది. ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Videos) మన కళ్ల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఆ వీడియోలో తాత తన సైకిల్ కు స్కూటర్ పార్ట్స్ అంటించి సైకిల్ ను బైకులాగా మార్చేశాడు.. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. తన పాత సైకిల్‌ను సరికొత్తగా మార్చాలని అనుకున్నాడు. ఇందుకోసం కాస్త వెరైటీగా ఆలోచించాడు. పాత హీరో స్ప్లెండర్ బైకు పార్ట్స్ ను అతికించాడు.. హ్యాండిల్ స్థానంలో బైకు హ్యాండిల్ అమర్చాడు. దానికి ముందు వైపు లైటుతో పాటూ హారన్ కూడా ఏర్పాటు చేశాడు.అంతేకాదు ఆ సైకిల్‌కు తగిలించిన బ్యాగ్‌లో బ్యాటరీని కూడా అమర్చారు. అందువల్ల హెడ్‌లైట్, హార్న్, అన్నీ పని చేస్తున్నాయి. ఇలా రాత్రిళ్లు కూడా ఎలాంటి భయం లేకుండా వెళ్లే ఏర్పాట్లు చేసుకున్నాడు.  పక్క నుంచి చూస్తే అసలు విషయం తెలుస్తుంది.ఈ కింద వీడియోను చూసి లైకు వేసుకోండి.. గ్రేట్ తాత నువ్వు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Agasti Muna (@1agastimuna)

agastimuna అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ తాత నడుపుతున్న వాహనాన్ని చూస్తే షాక్ అవక తప్పదు. ఎందుకంటే అది ముందు నుంచి చూస్తే బైక్‌ (Bike)లా కనిపిస్తోంది. విశాలంగా కూర్చోడానికి బైకు సీటును అమర్చాడు.అంతేకాదు.. దానికి నెంబర్ ప్లేట్ కూడా ఉంది.  . మొత్తంగా చూస్తే అతి బైకు ఏమో అనిపించేలా అద్భుతాన్ని సృష్థించాడు..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇది చూసిన వారంతా అతని తెలివిని మెచ్చుకోకుండా ఉండరు..  

ఈ వైరల్ వీడియోను ఇప్పటి వరకు 90 లక్షల మందికి పైగా వీక్షించారు. 4.6 లక్షల మందికి  ( వార్త రాసే సమయానికి) పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేస్తూ ఆ వృద్ధుడి ట్యాలెంట్‌ను కొనియాడుతున్నారు. ఇది హెచ్‌ఎఫ్ డీలక్స్ ప్రో మ్యాక్స్.... పెట్రోల్ అవసరం లేని బైక్.... ఈ బైక్‌‌తో ఎంతో ఆరోగ్యం.......సూపర్ క్రియేటివిటీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. .