తమ్ముణ్ణి చంపిన అన్న.. సహకరించిన వదిన

  • హత్యకు సహకరించిన వదిన
  • ఆస్తి తగాదాలే కారణమనిఆరోపిస్తున్న బంధువులు
  • పీఎస్ లో లొంగిపోయిన నిందితులు
  • నల్లకుంట పరిధిలోఆలస్యంగా వెలుగులోకి వచ్చినఘటన

నల్లకుంట: తమ్ముడితో గొడవపడిన అన్న..తన భార్యతో కలిసి అతడిని హత్య చేశాడు. ఈ నెల 5న రాత్రి నల్లకుంట పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ మురళీధర్ కథనం ప్రకారం..నల్లకుంటలోని బాయమ్మ గల్లీలోని 40 గజాల ఇంట్లో ఉండే రమేశ్(42), వెంకటేశ్(43) అన్నదమ్ములు. వీరిద్దరూ ఆ స్థలంలోనే వేర్వేరు పోర్షన్స్ లో ఉంటున్నారు.
వెంకటేశ్ డ్రైవర్ గా పనిచేసేవాడు. ఐదేళ్ల క్రితం వెంకటేశ్ ను వదిలేసి అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మద్యానికి బానిసైన రమేశ్​తాగి వచ్చి అన్న వెంకటేశ్,వదిన బబిత(36)తో గొడవపడేవాడు.

ఈ నెల 5న రాత్రి మద్యం తాగి ఇంటికి రమేశ్​మరోసారి వెంకటేశ్,బబితతో గొడవపడ్డాడు.వెంకటేశ్, అతడి భార్య బబిత తాడును రమేశ్​మెడకి బిగించి హత్య చేశారు. ఆ తర్వాత వెంకటేశ్,బబిత .. రమేశ్​డెడ్ బాడీని అతడి పోర్ష్ న్ లోని రూంలోఉంచారు. రమేశ్ ప్రతి రోజూ గోల్నాకలో ఉండే అక్క ఇంటికి వెళ్లేవాడు. శుక్రవారం రమేశ్ రాకపోయేసరికి అతడి అక్క నల్లకుంటలోని ఇంటికి వెళ్లింది. రమేశ్ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఆమె స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. క్లూస్ టీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రమేశ్ అక్క కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్న వెంకటేశ్​ హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈలోగా శనివారం రోజే వెంకటేశ్, బబిత దంపతలు నల్లకుంట పీఎస్ లో పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు సీఐ మురళీ ధర్ తెలిపారు. ఆస్తి కోసమే రమేశ్​ ను..వెంకటేశ్​ హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని..పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Latest Updates