గడ్డం గీసుకోకుంటే.. డ్యూటీ లేదు..ఎస్పీ ఆర్డర్

జైపూర్:  ముస్లిం పోలీసులు గడ్డం గీసుకోవాలని రాజస్థాన్ లోని అల్వార్ ఎస్పీ జారీ చేసిన ఆదేశాలను శుక్రవారం వెనక్కి తీసుకున్నారు. పోలీసులు ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా కనిపించాల్సి ఉంటుందని.. ముస్లిం పోలీసులు గడ్డం పెంచుకోరాదని అల్వార్ ఎస్పీ అనిల్ పారిస్ దేశ్ ముఖ్ ఆదేశాలు జారీ చేశారు. ముస్లిం పోలీసులు గడ్డం పెంచుకోవచ్చని ఇదివరకు ఉన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఇదివరకు ఉన్న నిబంధన ప్రకారం హెచ్ఓడీ పర్మిషన్ మేరకు గడ్డం పెంచుకునే వెసులుబాటు కల్పించారు. అల్వార్ జిల్లాలో 32 మంది ముస్లిం పోలీసులు గడ్డం పెంచుకున్నారు. వీరిలో 9 మందికి మాత్రమే గడ్డం గీసుకోవాలని, అప్పటివరకు డ్యూటీకి అనుమతించేది లేదన్నారు.

 

Latest Updates