5 రోజుల తర్వాత ఆనంద్ డెడ్ బాడీ లభ్యం

సంగారెడ్డి జిల్లా: బీరంగూడ ఇసుకబావి వాగులో కొట్టుకుపోయిన ఆనంద్ ను గుర్తించారు. వరద కారణంగా ఐదు రోజుల క్రితం కారుతో పాటు ఆనంద్ వాగులో కొట్టుకుపోయాడు. ఐదురోజుల తర్వాత.. కారుతో పాటు ఆనంద్ డెడ్ బాడీని గుర్తించారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు కాకినాడ నుంచి వచ్చిన గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు. ఐదు రోజుల తర్వాత కారుతో పాటు డెడ్ బాడీని బయటకు తీశారు. వరదలకు కొట్టుకుపోయిన కారు వాగులో 2 వందల మీటర్ల లోతుకు వెళ్లడంతో గుర్తించడం కష్టంగా మారింది.

Latest Updates