ఆ ఆరుగురు ప్లేయర్లకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్​

  • థార్‌‌ ఎస్‌‌యూవీలు ఇవ్వనున్న ఆనంద్‌‌ మహీంద్రా

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా టూర్‌‌లో అద్భుత పెర్ఫామెన్స్‌‌ చూపెట్టిన టీమిండియా యంగ్‌‌ క్రికెటర్లకు ఆటోమొబైల్‌‌ ఇండస్ట్రీ దిగ్గజం ఆనంద్‌‌ మహీంద్రా సర్‌‌ప్రైజ్‌‌ గిఫ్ట్స్‌‌ను ప్రకటించారు. బోర్డర్‌‌–గావస్కర్‌‌ ట్రోఫీ నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్‌‌ సిరాజ్‌‌, నటరాజన్‌‌, శార్దూల్‌‌ ఠాకూర్‌‌, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, నవ్‌‌దీప్‌‌ సైనీ, వాషింగ్టన్‌‌ సుందర్‌‌కు ‘థార్‌‌’ ఎస్‌‌యూవీలను ఇస్తున్నట్లు మహీంద్రా అండ్‌‌ మహీంద్రా కంపెనీ చైర్మన్‌‌ ఆనంద్‌‌ మహీంద్రా శనివారం ట్విటర్‌‌ ద్వారా తెలిపారు. ఈ ఆరుగురు క్రికెటర్లు.. కలను నెరవేర్చుకోగలమనే స్ఫూర్తిని ఇండియా యూత్‌‌కు అర్థమయ్యేటట్లు చేశారని ఆనంద్‌‌ పేర్కొన్నారు. సక్సెస్‌‌ సాధించే క్రమంలో ఎన్నో ఆటు పోట్లు దాటుకుంటూ సాగిన వీరి జర్నీ అందరిని ఇన్‌‌స్పైర్‌‌ చేసిందన్నారు. ఇక మహీంద్రా కంపెనీ తరఫున కాకుండా తన సొంత ఖర్చుతో క్రికెటర్లకు కార్లు అందజేస్తానని ఆనంద్‌‌ వెల్లడించారు.

For More News..

బంపర్ ఆఫర్.. వేయి రూపాయలుంటే విమానం ఎక్కొచ్చు

థ్యాంక్యూ ఇండియా.. థ్యాంక్యూ మోడీ!

కేసీఆర్‌‌ అంటే.. ‘కిలాడి చంద్రశేఖర రావు’

Latest Updates