వీడియో: ధనవంతులమని డబ్బులు ఇలా ఖర్చు చేస్తే ఎలా?

V6 Velugu Posted on Jul 21, 2021

ధనవంతుల్లో చాలా మంది విలాసాలు, సరదాల కోసం డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. కానీ ఇది సరికాదని ప్రముఖ పారిశ్రామకవేత్త ఆనంద్ మహింద్రా అంటున్నారు. డబ్బుందని ఇష్టానుసారం వృథా ఖర్చులు చేయొద్దని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోకు స్పందనగా మహింద్రా ఈ కామెంట్ చేశారు. అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన ఫెరారీ కారుపై వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. 

ఈ కారు వీడియో ప్రస్తుతం నెట్ లో వైరల్‌గా మారింది. పూర్తిగా బంగారు పూత పూసిన కారు ఇదని వీడియో ద్వారా తెలుస్తోంది. దీనిపై ఆనంద్‌ మహింద్రా ట్విట్టర్ లో అసంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదో ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చన్నారు. 'ఇది సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతుందో నాకర్థం కావడం లేదు. ధనవంతులమైనంత మాత్రాన డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదో దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు' అని మహింద్రా ట్వీట్ చేశారు. 

Tagged money, Viral Video, anand mahindra, Ferari Car, Gold Ferari

Latest Videos

Subscribe Now

More News